NTV Telugu Site icon

Delhi liquor scam: లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్‌.. అప్రూవర్‌గా మారిన దినేష్‌ అరోరా..

Delhi Liquor Scam

Delhi Liquor Scam

సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన వ్యాపారవేత్త, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సన్నిహితుడైన దినేష్‌ అరోరా అప్రూవర్‌గా మారిపోయాడు.. దీంతో, మనీష్‌ సిసోడియా చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. దినేష్ అరోరా బ్యాంకు ఖాతాకు విజయ్ నాయర్ డబ్బులు పంపినట్టుగా అభియోగాలున్నాయి.. దీంతో దినేష్‌ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ వేశారు.. దినేష్‌ అప్రూవర్‌గా మారారని.. ఆయన తెలిపే కీలక విషయాలు ఈ కేసు పరిష్కారానికి దోహదపడతాయని పిటిషన్‌లో పేర్కొంది సీబీఐ.. దీంతో, ఇవాళ కోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది..

Read Also: Vivek Venkataswamy: ఇది కేసీఆర్‌ విజయం కాదు.. వచ్చే ఎన్నికల్లో 65 – 70 సీట్లు మావే..!

అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో లింక్‌లను బయటపెట్టింది.. దానిని లింకులు తెలంగాణలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. పలువురు ప్రముఖులను సైతం అరెస్ట్‌ చేశారు.. సీబీఐ అరెస్ట్‌చేసిన వారిలో వ్యాపారవేత్త దినేష్‌ అరోరా ఒకరు కాగా.. ఇప్పుడు ఆయన అఫ్రూవర్‌గా మారడం ఆసక్తికరంగా మారింది.. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన.. అభిషేక్ రావు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలు కూడా ఉన్న విషయం తెలిసిందే..