Site icon NTV Telugu

జూబ్లీహిల్స్ ర్యాబిట్‌ పబ్‌పై కేసు.. వేట మొదలైందా..?

హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌లు పరిమితి సమయాన్ని మించి నడిపిస్తున్నారని, ఇళ్ల మధ్యలో లౌడ్‌ స్పీకర్‌లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటీవల పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పరిమితి సమయాన్ని మించి పబ్‌లు నిర్వహించవద్దని, నివాస ప్రాంతాలకు సమీపంలో పబ్‌లు నిర్వహించరాదని హెచ్చరించింది. దీంతో నిన్న జూబ్లీహిల్స్‌ ర్యాబిట్‌ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత రాత్రి సమయానికి మించి పబ్‌ యాజమాన్యం పబ్‌ నడిపినట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సోదాల్లో పబ్‌ నిర్వాకం బయటపడింది. దీంతో పబ్‌ యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఆదేశాలను భేఖాతరు చేస్తున్న పబ్‌లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ నిబంధనలు పాటించకున్నా పబ్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version