NTV Telugu Site icon

పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పై కారు బీభత్సం

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుపై కారు బీభత్సం కలిగించింది. 120 పిల్లర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది ఓ కారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుకు అడ్డంగా కారు పడి పోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కారును తొలగించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి మెహదీ పట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 121 పిల్లర్ వద్ద రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో పల్టీలు కొట్టింది కారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు.