అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు తెలంగాణ రైల్వే పోలీస్ ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అనురాధ వివరాలను వెల్లడించారు. జీఆర్‌పీ మరియు ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా కలిసి తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళ నిందితుల నుండి రూ. 7లక్షల20 వేల రూపాయలు విలువ చేసే 72 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల్లో మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుండి ముంబైకి గంజాయి తరలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 10 వ ప్లాట్ ఫామ్ పై ముంబాయి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్‌లో జీఆర్‌పీఎఫ్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు.
ఇందులో ఇద్దరు మహిళా ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న ఎనిమిది లగేజ్ బ్యాగ్ లను తనిఖీలు చేయగా 72 కిలోల గంజాయి లభించింది. ఈ కేసులో దీపక్ సంగ్లి మహారాష్ట్ర కు చెందిన మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. అతడి కోసం ఓ బృందం గాలిస్తుందని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. నిరంతరం 24/7 రైళ్లలో చెకింగ్ చేస్తున్నాము రైల్వే మార్గం గుండా సాగుతున్న గంజాయ్ సప్లయ్ నిర్మూలన దిశగా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రైల్వేలో తనిఖీల సమయంలో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సహకరించాలని ఎస్పీ అనురాధ విజ్ఞప్తి చేశారు.
