Bus Catches Fire: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది.. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన ఘటన.. ఇప్పటికీ అందరినీ కలచివేస్తుండగా.. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి జైపూర్ (ఒడిశా) వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే క్రిందకు దిగి ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది… ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..
Read Also: Nara Lokesh Kavali Visit: నేడు కావలికి మంత్రి నారా లోకేష్.. ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ..!
