Site icon NTV Telugu

క‌ర్నూలు జిల్లాలో దారుణం: పెళ్లిబాజాల‌కు భ‌య‌ప‌డి ప‌రుగులు తీసిన ఎద్దులు…

పెళ్లంటే బాజాలు, భ‌జంత్రీలు, డ్యాన్సులు, హంగామా ఉంటుంది. వీటి గురించి మ‌నుషుల‌కు తెలుసు. కానీ ఆవులు,గేదెలు, ఎద్దుల‌కు తెలియ‌దు. కొన్ని ఎద్దులు డ‌ప్పు శ‌బ్దానికి బెదిరిపోయి ప‌రుగులు తీస్తుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. క‌ర్నూలు జిల్లాలోని రామ‌ళ్ల‌కోట గ్రామంలో ఓ పెళ్లి తంతు జ‌రుగుతున్న‌ది. బాజాభ‌జంత్రీల‌తో పెళ్లి ఊరేగింపు ముందు వెళ్తుండ‌గా వెనుక‌నుంచి కాడెద్దులు బండితో స‌హా ప‌రుగులు తీశాయి. ఈ బండి పెళ్లి ఊరేగింపు మీద నుంచి వెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురికి గాయాల‌య్యాయి. ఆ కాడెద్దుల బండి య‌జ‌మాని ఆ బండి వెన‌కాలే ప‌రుగులు తీశాడు. సుమారు గంట‌న్న‌ర త‌రువాత క‌ష్ట‌ప‌డి ఆ ఎద్దులను ప‌ట్టుకున్నాడు. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. డ‌ప్పుల శ‌బ్దానికి ఎద్దులు బెదిరిపోయి పరుగులు తీశాయ‌ని దాని య‌జ‌మాని చెప్పుకొచ్చారు.

Read: వైర‌ల్‌: ఇండియాలో తొలి బ్లాక్ చెయిన్ వివాహం…

Exit mobile version