AP Crime: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట యముడిగా మారాడు.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు.. గత నెల 30వ తేదీన ముగ్గురు పిల్లలు దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4)లను బైక్ పై తీసుకొని అదృశ్యమయ్యాడు.. అయితే, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తన కన్న బిడ్డలను చంపి పెట్రోల్ పోసి కాల్చివేసి.. ఆపై ఆత్మహత్యకు గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. ఈ నెల 3న నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండి మండలం పెద్దపూర్ గ్రామ సమీపంలో బూరకుంట చెట్లల్లో పురుగుల మందు తాగి గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ నెల 4వ తేదీన దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4), మృతదేహాలను నాగర్ కర్నూల్ జిల్లాలోనే గుర్తించారు పోలీసులు… ఈ నెల 4న నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సూర్య తాండ సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య వర్షిణి, శివ ధర్మ మృతదేహాలను గుర్తించారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా తాండ్ర వద్ద పెద్దామ్మాయి మోక్షిత మృతదేహాన్ని గుర్తించారు.. పూర్తిగా తగలబడి గుర్తు పట్టలేని స్ధితిలో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.. ముగ్గురు పిల్లల మృతదేహలకు ఈ రోజు పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం మృతదేహలను అక్కడే ఖననం చేయనున్నారు బంధువులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ఘటనకు గల కారణాలపై వివరాలు సేకరించేపనిలో పడిపోయారు పోలీసులు.
