Site icon NTV Telugu

Brutal Murder: నరసరావుపేటలో దారుణహత్య

Dead

Dead

పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్‌ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు.

రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రామాంజనేయులు కిడ్నాప్, హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద హత్యకు గురైన రామాంజనేయులు డెడ్ బాడీ పోలీసులకు లభ్యమయింది.

రామాంజనేయులును తీవ్రంగా కొట్టి కాల్వలో వేసి కాళ్ళతో తొక్కి చంపేశారు హంతకులు. రామాంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు పోలీసులు. ఘటనాస్థలికి వచ్చిన మృతుని భార్య ప్రసన్నలక్ష్మీ, బంధువులు రామాంజనేయుల మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలి వద్ద వివరాలు సేకరిస్తోంది క్లూస్ టీం బృందం.
Read Also: Vijayawada: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఒకరు మృతి.. అసలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఏమైంది?

Exit mobile version