Boyfriend Crime: ప్రియురాలికి బూతు మెసేజ్‌లు.. హత్య కేసులో ప్రియుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyfriend Killed His Friend For Sending Vulgar Messages To His Girlfriend: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడని.. తన స్నేహితుడ్నే చంపేశాడు ప్రియుడు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు కానీ, చివరికి పోలీసులకు అతడు అడ్డంగా దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. శంకర్, మణికంఠ స్నేహితులు. వీళ్లు కూకట్‌పల్లిలో ఉంటున్నారు. శంకర్ కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయితో మణికంఠ కూడా సరదాగా మాట్లాడేవాడు. మెసేజ్‌లు సైతం పంపేవాడు. అయితే.. కొన్ని రోజుల నుంచి అతడు ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. తనకు అలాంటి బూతు మెసేజ్‌లు పెట్టొద్దని ఆ యువతి వారించినా.. మణికంఠ వినలేదు.
దీంతో.. చిర్రెత్తుకొచ్చిన యువతి, ఆ మెసేజ్‌ల విషయాన్ని తన ప్రియుడు శంకర్‌కి తెలియజేసింది. ఆ మెసేజ్‌లు చూసి శంకర్‌కి కోసం నషాళానికి ఎక్కింది. స్నేహితుడే ఇలాంటి పని చేస్తాడని అతడు నమ్మలేకపోయాడు. దాంతో.. మణికంఠని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాడు. గత శుక్రవారం మందు తాగుదామని మణికంఠని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కూర్చొని ఇద్దరూ బీర్లు తాగారు. ఈ నేపథ్యంలోనే తన ప్రియురాలికి పంపిన మెసేజ్‌ల గురించి శంకర్ ప్రస్తావించాడు. ఆ అంశంపై మాటామాటా పెరిగి, గొడవ పడ్డారు. అప్పుడు శంకర్ బీర్ బాటిల్‌ని పగలగొట్టి.. దాంతో పొడిచి మణికంఠని చంపేశాడు. అనంతరం తనకేమీ ఎరుగనట్టుగా.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
కట్ చేస్తే.. ఈ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు, రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. శంకర్‌తో కలిసి మణికంఠ మద్యం సేవించిన విషయం తెలిసి.. శంకర్‌ని పిలిపించారు. తాము మద్యం సేవిస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని.. తాము ప్రతిఘటించడంతో మణికంఠని చంపేశారని కట్టుకథ అల్లాడు. అయితే.. అతడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు శంకర్ నేరం అంగీకరించాడు. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినందుకే మణికంఠని చంపానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!