NTV Telugu Site icon

Boyfriend Cheats Girl: పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంతలో ట్విస్ట్ ఇచ్చాడు

Vikarabad Love Tragedies

Vikarabad Love Tragedies

Boyfriend Cheated A Girl In The Name Of Love In Vikarabad: పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఓ యువకుడు.. మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కుల్కచర్ల మండలం ఇప్పపల్లి గ్రామానికి చెందిన స్వాతి అనే యువతిని మనోహర్ అనే యువకుడు ప్రేమించాడు. నువ్వంటే ఎంతో ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువతి కూడా ప్రేమించింది. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే.. స్వాతికి తెలియకుండా మనోహర్ మరో యువతితో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి విషయాన్ని స్వాతి నుంచి సీక్రెట్‌గా ఉంచాలని ప్రయత్నించాడు. కానీ, ఈ విషయం స్వాతికి ఎలాగోలా తెలిసింది. దీంతో.. మనోహర్‌పై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, మరో యువతితో వివాహం చేసుకున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

K Laxman: మహిళల పట్ల ఎమ్మెల్సీ కవిత మొసలికన్నీరు కార్చుతున్నారు

వికారాబాద్‌లోనే ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. అంజయ్య అనే వ్యక్తి తన పెళ్లి విషయాన్ని దాచి, ఓ యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో, యువతి అతడ్ని నమ్మి తన సర్వస్వం సమర్పించింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి దాటవేస్తుండటంతో, ఆ యువతికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే అంజయ్యకు గతంలోనే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసింది. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకోకపోవడంతో, పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబసభ్యులు.. వెంటనే ఆ యువతిని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, విచారణ చేపట్టారు.

Manchu Manoj: నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే

Show comments