Bodies Of 7 From Same Family Found In Pune River: మహారాష్ట్రలోని పుణేలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ప్రతీకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని బలి తీసుకుంది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఏడుగురి మృతదేహాలు భీమా నది ఒడ్డున కనిపించాయి. తన కొడుకు మృతికి ప్రతీకారంగా.. ఓ వ్యక్తి ఈ కిరాతక పనికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య పూణేలో దువాండ్ తహసిల్‌లోని భీమా నది ఒడ్డున ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే ఆ మృతదేహాలు ఎవరివని విచారించగా.. మోహన్ పవార్(45), అతని భార్య సంగీతా మోహన్(40), అతని కుమార్తె రాణి ఫుల్‌వేర్(24), అల్లుడు శ్యామ్ ఫుల్‌వేర్(28), వారి ముగ్గురు పిల్లలు (3 నుంచి ఏడేళ్ల మధ్య)గా గుర్తించారు. వీరిది హత్యేనని నిర్ధారించుకున్న పోలీసులు.. ఎవరు చంపారని దర్యాప్తు చేశారు. అప్పుడు ‘ప్రతీకారం’ కోణం వెలుగుచూసింది.
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్‌గా..
మోహన్ పవార్ బంధువైన అశోక్ కళ్యాణ్ పవార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు. అతనికి సహకరించిన శ్యామ్ కల్యాణ్ పవార్, శంకర్ కల్యాణ్ పవార్, ప్రకాశ్ కల్యాణ్ పవార్, కాంతాబాయి సర్జేరావ్ జాదవ్‌లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం అశోక్ పవార్ కొడుకు ధనుంజయ్ పవార్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికి సంబంధించిన కేసు పుణేలో నమోదైంది. అయితే.. ధనుంజయ్ మృతికి మోహన్ పవార్ కారణమని దర్యాప్తులో తేలడంతో, అశోక్ కళ్యాణ్ అప్పటి నుంచి మోహన్ పవార్‌పై పగ పెంచుకున్నాడు. తన కొడుకు చావుకి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు మోహన్ పవార్ కుటుంబాన్ని కడతేర్చినట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టంలో మృతులంతా నీట మునిగి చనిపోయినట్లు తేలింది. మృతులందరూ ఉస్మానాబాద్ జిల్లాలోని మరఠ్వాడాలోని బీడ్ ప్రాంతానికి చెందిన వారని, వారంతా కూలీ పనులు చేసుకునేవారని తెలిపారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 302 (హత్య), 120బీ (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేసినట్లు పుణే రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ తెలిపారు.
US JD Sues Google: భారత్ తరహాలోనే.. అమెరికాలోనూ గూగుల్‌కి ఇక్కట్లు