Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!

  • హైకోర్టుకు ముస్కాన్, సాహిల్..
  • మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం..
  • ఉరిశిక్ష రద్దుకు అప్పీల్..
Meerut Blue Drum Murder

Meerut Blue Drum Murder

Meerut Blue Drum Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘‘మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసు’’లో నిందితులు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాకు మీరట్ కోర్టు అక్టోబర్ 14న ఉరిశిక్ష విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ దోషులు ఇద్దరూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

ఈ కేసులో భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను మస్కాన్, తన లవర్ సాహిల్‌తో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. సౌరభ్ 2025 మార్చిలో హత్యకు గురయ్యాడు. ఆహారంలో మత్తు మందు కలిపి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి, ఒక బ్లూ డ్రమ్‌లో సిమెంట్‌తో పూడ్చేశారు. ఈ కేసు విచారణ తర్వాత మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. 13 నెలల్లోనే విచారణ ముగించారు. మొత్తం 126 కోర్టు హియరింగ్స్ జరిగాయి. 22 మంది సాక్షులను విచారించారు. వీరిలో కత్తులు, నీలి డ్రమ్ అమ్మినవారు ఉన్నారు. హోటల్ మేనేజర్లు, క్యాబ్ డ్రైవర్ల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు హైకోర్టు ముందుకు రానుంది.