NTV Telugu Site icon

Bihar : విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్లు.. ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావమై..

Bihar Student

Bihar Student

యువత ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. తమ వయస్సును కూడా మరచి మేము యూత్ అంటూ చెడు వ్యసానాలకు బానిసలుగా మారుతున్నారు.. చదువులు పక్కన పెట్టి సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. అలా టెన్త్ చదివే ఓ విద్యార్థి బహిరంగంగానే పొగ తాగడాన్ని గమనించిన స్కూల్ టీచర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విద్యార్థిని టీచర్లు బెల్టులతో విచక్షణా రహితంగా కొట్టడంతో అతను మృతి చెందాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది..

వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ చంపారణ్ జిల్లా మధుబన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం రిపేర్ కు ఇచ్చిన తన తల్లి మొబైల్ ను తిరిగి తెచ్చేందుకు స్థానిక రిపేర్ షాపుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో స్నేహితులతో కలిసి పొగతాగాడు. అతను చదువుతున్న స్కూల్ చైర్మన్ విజయ్ కుమార్.. ఈ ఘటనను చూశారు. వెంటనే యువకుడి తండ్రిని పిలిపించి విషయం చెప్పారు.అనంతరం యువకుడిని పాఠశాల ఆవరణలోకి ఈడ్చుకెళ్లి.. బెల్టులతో విచక్షణా రహితంగా చావబాదారు.. అయితే దెబ్బలు తట్టుకోలేక ఆ విద్యార్థి సోమ్మసిల్లి పడిపోయాడు.. ఇతర టీచర్లు కూడా తీవ్రంగా కొట్టడంతో.. అతను స్పృహ కోల్పోయాడు.

అది గమనించిన టీచర్లు అతన్ని వెంటనే స్థానిక ప్రైవేటు నర్సింగ్ హోమ్ కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ముజఫర్ పుర్ లో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. మెడ, చేతుల భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రైవేటు భాగాల్లోనూ తీవ్రంగా రక్తస్రావం అయిందని మృతుని బంధువులు ఆరోపించారు. సదరు యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు..అయితే, తాము విద్యార్థిని కొట్టలేదని పాఠశాల డైరెక్టర్ అన్నారు. సిగరెట్ తాగుతుండడంతో బెదిరించామని.. తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయంతో విషం తాగాడు. అనంతరం చికిత్స నిమిత్తం ముజఫర్‌పూర్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని డైరెక్టర్ ను, టీచర్స్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..