Crime News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి శవమై తేలింది. అడవిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆమె డెడ్ బాడీ పక్కన క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అమ్మాయిని బలి ఇచ్చారా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Drugs: డ్రగ్స్ కావాలా నాయనా.. వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో ఒక్క మెసేజ్ చాలు!
చుట్టూ క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు. పక్కనే అమ్మాయి ఆధార్ కార్డ్. దాని ఆధారంగా కప్పల వర్షిణిగా గుర్తింపు. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆ అమ్మాయిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. ఇది ఆమె పక్కనే ఉన్న ఆధార్ కార్డ్ ద్వారా స్పష్టమైంది. ఐతే అమ్మాయి దాదాపు 20 రోజుల క్రితం అదృశ్యమైంది. ఆగస్టు 6న ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి.. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఇదిగో ఇలా శవమై తేలింది.
US Police Firing: అమెరికాలో ఓ సిక్కును కాల్చి చంపిన పోలీసులు.. ఏం జరిగిందంటే..
సరిగ్గా భూపాలపల్లి- కాటారం రహదారిలో అడవిలో యువతి మృతదేహం ఉంది. దీన్ని పశువుల కాపర్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డెడ్ బాడీ పక్కనే ఆధార్ కార్డ్‌తోపాటు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇతర పూజా సామాగ్రి ఉన్నాయి. ఫలితంగా యువతిపై క్షుద్రపూజలు చేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో ఆమె ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. ఎవరైనా క్షుద్ర పూజలు చేసి బలి ఇచ్చారా? అని అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి ఈ అటవీ ప్రాంతంలోకి ఎందుకు వచ్చింది..! ఎలా వచ్చింది..! ఎవరైనా తీసుకువచ్చారా..! పూజలు జరిపి హతమార్చారా..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.
