Bengaluru: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం.. ఏం జరిగిందంటే..!
- పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం
- ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డ్.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పచ్చని సంసారంలో అక్రమ సంబంధం అగ్గిరాజేసింది. కుటుంబాన్ని ముక్కలు చేసింది. మనస్తాపంతో వివాహిత అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది.
మానస (25).. దిలీప్ అనే యువకుడ్ని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ దంపతుల దాంపత్యానికి గురుతుగా ఐదేళ్ల కుమార్తె ఉంది. సాఫీగా సాగిపోతున్న ఫ్యామిలీలోకి మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. అంతే పచ్చని సంసారంలో అగ్గిరాజేసింది. ఇంకేముంది నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర నుంచి దిలీప్.. మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో నిత్యం భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత అర్ధరాత్రి బెంగళూరులోని బ్యాదరహళ్లిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మానస ప్రాణాలు తీసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు మొబైల్లో వీడియో ఆన్ చేసి.. తన గోడు వెళ్లబుచ్చుకుంది. భర్త అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నట్లు వాపోయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కూడా.. ఒక్క నిమిషం ఆగి మొబైల్ ఆఫ్ చేసి తనువు చాలించింది.
Also Read
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అక్రమ సంబంధంతోనే మానస ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని.. దీంతో మానస బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు. మానసను ఆస్పత్రికి తీసికెళ్లేలోపే ప్రాణాలు వదిలిందని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల బెంగళూరులో ఒక హాస్టల్లోకి అర్ధరాత్రి యువకుడు ప్రవేశించి అత్యంత దారుణంగా యువతిని చంపేశాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడ్ని మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!