Site icon NTV Telugu

ఆ వీడియోలకు అలవాటు పడిన భర్త.. రోజూ భార్యను అలా చేస్తూ

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది.. కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం.. మరికొంతమందికి సినిమాలంటే పిచ్చి.. ఇంకొంతమందికి సంగీతం అంటే ఇష్టం.. వీటి వలన ఎన్ని అనర్దాలు వచ్చినా వారు మాత్రం వారికి అలవాటైన పనిని మాత్రం మానరు. ఎవరు చెప్పినా వినరు. తాజాగా ఒక భర్త నిత్యం పోర్న్ వీడియోలు చూస్తూ భార్యను వేధిస్తున్నాడు. ఆ అలవాటు మానుకోమని చెప్పినందుకు భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్య, భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టు మెట్లెక్కింది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే..జయనగర్ లో ఉండే మహిళకు గతేడాది నవంబర్ లో బెంగుళూరుకు చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. పెళ్లైన కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త ఆ తర్వాత తనని పట్టించుకోకుండా అర్ధరాత్రి పోర్న్ వీడియోలు చూస్తూ కాలం గడిపేవాడు. అంతేకాకుండా కాల్ గర్ల్స్ తో మాట్లాడుతూ వారికోసం ఉన్న డబ్బును మొత్తం వెచ్చించేవాడు. మాట్రిమోనీ సైట్ లో రెండో పెళ్ళికి అప్లై చేసి, మొదటి భార్య మృతి చెందినట్లు తెలపడంతో భార్యకు కోపం నషాలానికెక్కింది. ఈ పనులు ఏంటని భర్తను నిలదీసింది. దీంతో అతడు ఆమెను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. రోజూ ఇంటికి వచ్చి, తన ముందే పోర్న్ వీడియోలు చూసేవాడని, కాల్ గర్ల్స్ ని బుక్ చేసుకొని వెళ్లేవాడని భార్య తెలిపింది. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేని భార్య కోర్టు మెట్లెక్కింది. తనకు ఆహారం కూడా సరిగ్గా పెట్టడం లేదని, ఇంట్లో తనను బాధించి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది.

Exit mobile version