NTV Telugu Site icon

Bengaluru: “సార్, నేను లవ్ జిహాద్, మతమార్పిడి బాధితురాలిని రక్షించండి”..

Love Jihad

Love Jihad

Bengaluru: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతితో అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవడంమే కాకుండా, పెళ్లి కోసమ మతం మారాలని ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మొగిల్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి బెంగళూర్ లోని టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి బాధిత యువతితో 2018 నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సదరు యువతి కూడా బెంగళూర్ లోనే ఓ టెక్ కంపెనీలో పనిచేస్తుంది.

అయితే వీరిద్దరు వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారు. కాగా, అష్రఫ్ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మారాలని వేధిస్తున్నాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు పెళ్లిని సాకుగా వాడుకున్నాడని యువతి ఆరోపిస్తోంది. అష్రఫ్ తనను ‘అసహజ లైంగిక చర్యలు’ పెట్టుకోవాలని బలవంతం చేశాడని, అతని సోదరుడితో ఫోన్ లో బెదిరించాడని యువతి ఆరోపించిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

Read Also: Team India: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్.. వరల్డ్ కప్ కష్టమే..!

సెప్టెంబర్ 6న యువతి ఎక్స్(ట్విట్టర్)లో తన బాధను వెల్లగక్కడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ పోలీసులు, పీఓంఓ ఆఫీసును ట్యాగ్ చేస్తూ.. ‘‘సార్, నేను లవ్ జిహాద్, అత్యాచారం, అసహజ సెక్స్, బలవంతమపు మతమార్పిడి బాధితురాలిని. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది. దయచేసి వెంటనే బెంగళూర్ పోలీసులు సాయం చేయండి’’ అంటూ పోస్ట్ చేసింది.

యువతి ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 7న బెల్లందూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరగడంతో తరువాత కేసును బదిలీ చేశారు. సెప్టెంబర్ 14న నిందితుడు అష్రఫ్ పై 376 (అత్యాచారం), 377 (అసహజ నేరాలు), 506 (నేరపూరిత బెదిరింపులు), 420 (మోసం), కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు-2022 ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు శ్రీనగర్ కి ఒక పోలీస్ బృందాన్ని పంపించారు. అఫ్రఫ్ ని బుధవారం పట్టుకుని వచ్చి గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూర్ రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బల్డంది చెప్పారు.