Site icon NTV Telugu

Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!

Bengalurummurder

Bengalurummurder

దేశంలో రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నా నేరస్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కన్న కూతురు ఎదుటే హతమార్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Italy: ఇటలీలో పెద్ద ఎత్తున అల్లర్లు.. ప్రధాని మెలోనికి వ్యతిరేకంగా పాలస్తీనీయులు నిరసనలు

రేఖ(32) అనే మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న లోహితాశ్వ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మూడు నెలల క్రితం లోహితాశ్వను రేఖ ఒక గుడిలో రెండో వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి సిరా పట్టణం నుంచి బెంగళూరుకు మకాం మార్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇక మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో పెద్ద కుమార్తె రేఖ దగ్గర ఉంటుండగా.. రెండో పాప రేఖ తల్లిదండ్రుల దగ్గర పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: Kolkata Rain: భారీ వరదలతో కోల్‌కతా అతలాకుతలం.. ఏడుగురు మృతి

అయితే రేఖ బెంగళూరులో ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తోంది. అక్కడే డ్రైవర్ ఉద్యోగం ఉంటే అది లోహితాశ్వకు ఇప్పించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో రేఖ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని లోహితాశ్వ చూడడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తనను కాకుండా ఇంకొక వ్యక్తితో ఎఫైర్ నడిపిస్తోందని కక్ష పెట్టుకున్నాడు.

సోమవారం రేఖ తన కూతురితో కలిసి బస్ స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో లోహితాశ్వ కత్తితో వచ్చి రేఖపై దాడి చేయడం మొదలుపెట్టాడు. 12 ఏళ్ల కూతురు చూస్తుండగానే దాడి చేశాడు. డజన్లు సార్లు కత్తితో పొడవడంతో రేఖ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కారణంతో ఆమె ప్రాణాలు వదిలింది. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version