Love : తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన అక్షిత, తన మాజీ ప్రియుడు సురేష్ మోసపూరిత చర్యల కారణంగా పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో మోసపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెల్కటూర్ గ్రామానికి చెందిన అక్షిత, అదే గ్రామానికి చెందిన సురేష్ మధ్య కొంతకాలంగా ప్రేమ కొనసాగింది. అయితే, వీరి ప్రేమకు పెద్దలు అడ్డుకట్ట వేశారు. చివరికి అక్షిత తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు.
Sanjay Dutt : రూ.72 కోట్ల ఆస్తి ఆమె ఫ్యామిలీకి ఇచ్చేశా..
వివాహం తర్వాత కూడా సురేష్ అక్షితను వదలకుండా తరచూ వేధించాడు. ఈ విషయం గుర్తించిన భర్త, అక్షితను పుట్టింటికి పంపించాడు. ఈ సమయంలో సురేష్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అక్షితను శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి విషయం ప్రస్తావించగానే సురేష్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అక్షిత మోసపోయిన విషయాన్ని గ్రహించింది.
దీంతో.. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్షిత కరణ్‌కోట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. సురేష్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల
