యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని కిరాతకంగా కొట్టి చంపిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణ శిక్ష విధించింది బంగ్లాదేశ్ కోర్టు. 2019లో నీటి పంపకాలకు సంబంధించి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. దీనిని విమర్శిస్తూ అబ్రర్ ఫహద్ ఫేస్‌బుక్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అబ్రర్ ఫహద్ తీరుపై అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం ఆగ్రహించింది.
అబ్రర్ ఫహద్ క్రికెట్ బ్యాట్లు, ఇతర వస్తువులతో 25 మంది విద్యార్థులు తీవ్రంగా కొట్టారు. దీంతో అబ్రర్ ఫహద్ చనిపోయాడు. ఫహద్ హత్యను నిరసిస్తూ అప్పట్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇక, హత్యకు సంబంధించి 20 మందికి మరణ శిక్ష విధించిన కోర్టు… మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. కాగా, ఈ ఘటకు బాధ్యులైన వాళ్లలో ముగ్గురు ఇప్పటికీ ఆచూకీ లేరు. మరణ శిక్ష పడిన వాళ్లంతా 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే. కాగా తీర్పును పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాగతించగా, దీనిపై అపీల్‌కు వెళ్తామన్నారు దోషుల తరఫు న్యాయవాది.
