NTV Telugu Site icon

Crime: బాలాపూర్లో బీటెక్ విద్యార్థిని హత్య చేసిన స్నేహితులు.. ముగ్గురు అరెస్ట్..!

Crime

Crime

బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ ను స్నేహితులే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 దగ్గర ప్రశాంత్ ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు.. ముగ్గురు నిందితులని పట్టుకోవడానికి మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది. మృతుడు ప్రశాంత్ నిందితులు ముగ్గురు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్టు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, హత్య చేసి పరారైన నిందితులను బాలాపూర్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Supreme Court : సుప్రీంకోర్టు ఆవరణలో లాయర్ తొడ కొరికేసిన కోతి

అయితే, ఎంవీఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ప్రశాంత్ హత్యకు ప్రేమ వ్యవహారం లేక ఆర్థిక వివాదాల పాత కక్షలే కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కేవలం 15 రోజుల్లోనే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు నిందితులను ఎంక్వైరీ చేస్తున్నారు.

Show comments