Site icon NTV Telugu

న్యాయ చరిత్రలోనే మొదటిసారి.. బాలుడిపై జడ్జి అత్యాచారం.. ఇంకో ఇద్దరితో కలిసి

ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయస్థానానికి వెళ్తారు. జడ్జి ఏది చెప్తే అదే వేదం.. కానీ, అలాంటి ఒక న్యాయమూర్తే పాడుపనికి తెగించాడు. ఎంతోమంది నేరస్తులను శిక్షించిన అతను పెద్ద నేరానికి పాల్పడ్డాడు. ఓ న్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందితో కలిసి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలరోజులు ఈ దాష్టికాన్నీ కొనసాగించారని బాధితుడి తల్లి ఆరోపించింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. జైపూర్ లో ఏసీబీ కేసులను విచారించే ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్‌ గోలియా మీద ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. జడ్జి జితేంద్ర సింగ్‌ గోలియా, అతని స్టెనో అన్షుల్‌ సోని, మరో ఉద్యోగి రాహుల్‌ కటారియా అనే వ్యక్తి ముగ్గురు కలిసి తన కుమారుడికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాకుండా నెలరోజులుగా తమ కుమారుడిని తమకు చూపించకుండా చిత్రహింసలకు గురిచేశారని, ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరించినట్లు తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు జైపూర్ లో సంచలనంగా మారింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Exit mobile version