Site icon NTV Telugu

Fake Currency Notes From ATM: ఏటీఎం నుంచి చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లు.. కంగుతిన్న కస్టమర్‌..

Fake Currency

Fake Currency

ఎక్కడైనా ఏటీఎంలో ఉండే నోట్లు ఫేక్‌ అని ఎవరూ అనుకోరు.. ఎందుకంటే.. బ్యాంకుల ఆధ్వర్యంలో ఏటీఎంలు నడుస్తుంటే.. వారే నేరుగా ఏటీఎంలో డబ్బులు లోడ్‌ చేస్తుంటారు.. కొన్ని ఏటీఎంలలో ఏజెన్సీలు డబ్బులు వేస్తుంటాయి.. అయితే, డబ్బులు విత్‌డ్రా చేయడం కోసం ఏటిఎంకు వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.. డబ్బులు డ్రా చేసిన సదరు వ్యక్తికి.. ఏటీఎం నుంచి రూ.200 నోట్లు వచ్చాయి.. అయితే.. ఓ నోటుపై ‘Full of Fun’ అని రాసి ఉండడంతో కంగుతిన్నాడు.. మొదట ఏం చేయాలో అర్థం కాలేదు.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినా.. సరైన సమాధానం లేకపోవడంతో.. మీడియా ముందుకు వచ్చాడు..

Read Also: MLA Koneru Konappa: అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్..

ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండుగను పురస్కరించుకొని ఓ వ్యక్తి షాపింగ్ చేయడానికి అమేఠీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి స్థానికంగా ఉన్న ఏటీఎం‌కు వెళ్లారు.. ఏటీఎం నుంచి కొంత డబ్బు విత్‌ డ్రా చేశాడు. అయితే, ఆ తర్వాత ఏటీఎం మిషన్‌ నుంచి వచ్చిన కరెన్సీ నోట్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు.. ఎందుకంటే.. రూ.200 నోటుపై ‘ఫుల్‌ ఆఫ్‌ ఫన్‌’ అని రాసిఉంది.. అంతేకాదు.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఉండాల్సిన స్థానంలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడాన్ని చూసి షాక్‌కు గురైన సదరు వ్యక్తి.. ఏటీఎం నుంచి ఫేక్ కరెన్సీ వచ్చినట్టు నిర్ధారణకు వచ్చి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.. ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో.. మీడియా ముందుకు వచ్చాడు ఆ బాధితుడు.. ఈ వార్త కాస్తా మీడియాలో రావడంతో.. సాబ్జిమండిలోని మున్షిగంజ్ రోడ్డులో ఉన్న ఏటీఎం నుంచి దొంగ నోట్లు వస్తున్నాయనే వార్త వైరల్‌గా మారిపోయింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Exit mobile version