NTV Telugu Site icon

Online Trafficking: ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్ అరెస్ట్

Online Trafficking

Online Trafficking

Assistant Director Sunil Boyina Arrested In Online Trafficking Case: ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న అమ్మాయిల జీవితాల్ని కొందరు దుండగులు బుగ్గిపాలు చేస్తున్నారు. అవకాశాల పేరిట ఆశచూపి.. వారిని చీకట్లో తోసేస్తున్నారు. వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. పడకసుఖం అందిస్తే పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయని చెప్తూ.. ఆ అమ్మాయిల చేత పాడుపని చేయిస్తున్నారు. ఇలాంటి పాడు పనే చేయిస్తూ.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తాజాగా పట్టుబడ్డాడు. సినిమా అవకాశాల పేరుతో ఉత్తరాతి నుంచి అమ్మాయిల్ని పిలిపించి.. వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. చివరికి అతగాడు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Jr.NTR Political Entry: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చినా లాభంలేదు..!

అతని పేరు సురేష్ బోయిన. ఓ ప్రముఖ దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. 2017 నుంచి ఆ దర్శకుడి వద్ద పని చేస్తున్న సురేశ్.. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. ముంబై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఇక్కడికి పిలిపించి.. వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి.. అతడు ఈ పాడు పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని కొందరు ప్రముఖులకు సైతం ఇతడు యువతుల్ని సరఫరా చేశాడు. పెద్దవారి కోరికలు తీరిస్తే.. భారీ అవకాశాలు వస్తాయని, దాంతో కెరీర్ మలుపు తిరుగుతుందని మాయమాటలు చెప్తూ వచ్చాడు. గోవా, బెంగళూరులో కూడా వ్యభిచారం దందాను నడిపించాడు.

Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..

సురేష్ బోయిన చేస్తున్న ఈ చీకటి వ్యాపారం గురించి తెలుసుకుని.. పోలీసులు అతడ్ని అడ్డంగా పట్టుకున్నారు. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి, సాక్ష్యాలతో పాటు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు మేకల అఖిల్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వీరి చెర నుంచి ఆ యువతుల్ని తప్పించారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? పెద్దతలకాయల హస్తం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Show comments