Man Kills Niece’s Lover: ఇటీవల కాలంలో ప్రేమ సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. యువతీ యువకులు ప్రేమించుకోవడం, అది పెద్దలకు నచ్చకపోవడంతో వివాదాలు మొదలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కులాలు వేరు కావడంతో పరువు హత్యలకు దారి తీస్తోంది. ఇటీవల కాలంలో మనం చాలా సందర్భాల్లో ఇలాంటి హత్యల్ని చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే జరిగింది.
Read Also: Actor Bikshu : ఇలియానా బాగా ఇబ్బంది పెట్టేసింది.. ఏకంగా 9 నెలలు పాటు!
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన మేనకోడలిని ప్రేమించినందుకు ఓ యువకుడి తలనరికి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని తూర్పు సియాంగ్ జిల్లాలో బుధవారం జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి తన మేనకోడలి ప్రేమికుడి తల నరికి, తలతో పాటు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రస్కిన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
శిబు బైశ్యా అనే నిందితుడు 19 ఏళ్ల అజయ్ దాస్‌ని పొలంలో తల నరికి చంపేసి, తలతో రస్కిన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడని పోలీస్ అధికారి సీ జోసెఫ్ తెలిపారు. అజయ్ దాస్‌కి తన మేనకోడలితో సంబంధం ఉందన్న కోపంతో బైశ్య ఈ హత్యకు పాల్పడ్డాడు. ఇద్దరూ కూడా అస్సాం నుంచి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి హత్యానేరం కింద సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.
