Site icon NTV Telugu

Palnadu: ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన.. ఏఎస్సై కుమారుడిపై మరో కేసు నమోదు

Accident

Accident

Palnadu: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్సై కొడుకు వెంకట నాయుడుపై మరో కేసు నమోదయ్యింది. ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం వద్ద నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన వెంకట నాయుడు తన అనుచరులతో కారులో వచ్చి లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో లారీని వెనుక వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అయితే, సీసీ ఫుటేజ్ ఆధారంగా చిలకలూరిపేట రూరల్ పోలీసులు వెంకట నాయుడుతో పాటు అతని అనుచరులు నలుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉపయోగించిన కారు విజయవాడకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డిది కాగా.. వ్యక్తిగత అవసరాలకోసం కారును నకరికల్లుకు చెందిన అంజి వద్ద తాకట్టుపెట్టాడు. కారు నెంబరు మార్చి ఉపయోగించారని తెలుసుకున్న శ్రీనివాస్‌ రెడ్డి నర్సరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంకట నాయుడుతో పాటు అతని గ్యాంగ్ పై కేసు నమోదు చేశారు.

Read Also: Storyboard: పంచాయితీ వ్యవస్థ ప్రాధాన్యత ఏంటి? కాంగ్రెస్ కు ఎలా కలిసొస్తుంది?

Exit mobile version