NTV Telugu Site icon

Dead Body in Parcel Case: డెడ్‌బాడీ హోమ్‌ డెలివరీ కేసులో బిగ్‌ ట్విస్ట్..

Dead Body Parcel West Godavari

Dead Body Parcel West Godavari

Dead Body in Parcel Case: సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ హోమ్‌ డెలివరీ కేసులో ట్విస్టులమీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరిజిల్లా యండగండిలో ఈనెల 19వ తేదీన సాగి తులసి అనే మహిళ ఇంటికి చేరిన పార్సిల్ డెడ్‌బాడీ కేసులో పోలిసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ వచ్చిచేరినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్‌ వర్మ రెండో భార్య రేవతి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భర్తకు దూరమై ఒంటరిగా ఉంటున్న అక్క తులసికి చెందాల్సిన ఆస్తిని కొట్టేసేందుకు భర్త సుధీర్ వర్మతో కలసి ప్లాన్ డెడ్‌బాడీ పార్సిల్‌ పథకాన్ని రచించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంటికి అరిష్టం పట్టిందని, పూజలు చేసేందుకు డబ్బు అవసరమని తల్లిదండ్రులను రేవతి ఒప్పించి.. ఆస్తి కొట్టేయాలని ప్రయత్నం చేసిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.. ఈన ప్లాన్‌లో భాగంగానే ఎలాంటి సంబంధంలేని పర్లయ్యను హత్యచేసి పార్సిల్‌ చేసారా? అనే కోణంలో ఆధారాలు సేకరించే పనిలో పడిపోయారు పోలీసులు..

Read Also: Off The Record: ఆ విషయంలో కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ అవుతుంది..?

కాగా, పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళకు ఈనెల 19వ తేదీన ఇంటి నిర్మాణ సామాగ్రి పేరుతో అందిన పార్సెల్ లో వచ్చిన డెడ్ బాడీ కలకలం రేపింది. ఇంటి నిర్మాణ సామాగ్రి పేరుతో ఓ ఆటో డ్రైవర్ పార్సిల్ తీసుకొని అందించాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం ఆచూకీ గుర్తించేందుకు పోలీసులకు నాలుగు రోజుల సమయం పట్టింది. కాళ్ల మండలం గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న సిద్ధార్థ వర్మ అలియాస్ సుధీర్ వర్మపై పోలీసులు మొదటినుంచి అనుమానం వ్యక్తం చేశారు.. పార్సిల్ సాగి తులసి ఇంటికి వచ్చిన నాటి నుంచి సుధీర్ వర్మ అతని మొదటి భార్య పరారీలో ఉండడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఐదు రోజుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే..

Read Also: Chinni Krishna: ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం!

అయితే, డెడ్ బాడీ పార్సెల్ అందుకున్న సాగి తులసి చెల్లెలు రేవతిని సిద్ధార్థ వర్మ రెండవ వివాహం చేసుకున్నాడు. సాగి తులసి భర్తకు దూరంగా ఉండడంతో ఆమెకు దక్కే ఆస్తిలో భాగమైన పొలాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధార్థ వర్మ పార్సిల్‌లో మృతదేహాన్ని పంపి ఆమెను భయపెట్టేందుకు ప్రయత్నించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వదిన ఆస్తిని కాజేసేందుకు వేసిన ప్లాన్ లో భాగంగా కాళ్ల మండలం గాంధీనగరం కు చెందిన బర్రె పర్లయ్య ను నిందితుడు సిద్ధార్థ వర్మ హత్య చేసి మృతదేహాన్ని బాక్సులో పెట్టి ఎండగంటిలోని అతని వదినకు పంపించాడు. విషయం బయటికి పొక్కడంతో కలకలం రేగింది. దీంతో తాను నివాసముండే గాంధీనగరం నుంచి నిందితుడు రెడ్ కలర్ కారులో కుటుంబంతో సహా పరారయ్యాడు. మృతదేహం ఆచూకీ లభించడంతో సుధీర్ వర్మ నిందితుడు అనడానికి బలమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. మూడు రోజులు పని నిమిత్తం పర్లయ్యను ఇంటికి పిలిపించుకున్న వర్మ అతనిని ఎందుకు హత్య చేశాడు..? మృతదేహాన్ని అతని వదిన ఇంటికి ఎందుకు పంపించాడు అనే విషయాలపై పూర్తి ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈనెల 16, 17 తేదీల్లో పర్లయ్యను పనికి తీసుకువెళ్లిన సుధీర్ వర్మ 19వ తేదీ సాయంత్రం హడావిడిగా తన ఇంటి నుంచి కుటుంబంతో సహా కారులో పోతున్న విజువల్స్ ఎన్టీవీ చేతికి చిక్కాయి. సుధీర్ వర్మ ఇంటి వద్ద పర్లయ్య పనిచేస్తున్న విజువల్స్ సైతం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పార్సెల్ వచ్చిన డెడ్ బాడీ మిస్టరీ కొంతవరకు వీడింది. ఇదే సమయంలో సుధీర్ వర్మ ఇంటి నుంచి మరొక చెక్క పెట్టను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే..

Show comments