Andrapradesh : ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బస్సు ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి.. గత రెండు నెలలుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. బస్సులు ఢీ కొట్టుకోవడం, బోల్తా పడటం, ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఎన్నో ఘటనలు లెక్క లేనన్ని వెలుగు చూడటంతో జనాలు బస్సుల్లో ప్రయాణం చెయ్యాలంటేనే భయంతో వణికి పోతున్నారు.. రాత్రి పూట ప్రయాణాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో జనాలు దూర ప్రయాణాలు బస్సుల్లో చెయ్యాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడికే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు..
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది.. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అర్ద రాత్రి దాటడంతో డ్రైవర్ నిద్రను కంట్రోల్ చేసుకోలేక నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65),అబ్దుల్ హాని(60),షేక్ రమీజ్ (48),ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం(65),షేక్ షబీనా(35),షేక్ హీనా(6)గా గుర్తించారు.. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!