Daughters Kill Mother: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం దగ్గర గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో షాకింగ్ విషయాలను బయటకు వచ్చాయి. అయితే, పోలీసుల విచారణలో మృతురాలి సొంత కుమార్తెలు, ఆమె మరిది హంతకులుగా తేలారు. కాగా, హత్యకు గురైన మహిళ విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌కు చెందిన బంకిళ సంతు (సంతోషమ్మ)గా పోలీసులు గుర్తించారు.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
అయితే, ఆస్తి తగాదాలు, తల్లి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో చిన్నాన్న సహాయంతో తల్లి సంతు హత్యకు కూతుళ్లు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి టవల్‌తో మెడ బిగించి దారుణంగా హత్య చేశారు అని వెల్లడించారు. అంతటితో ఆగకుండా, నిందితులు ఆ శవాన్ని షిఫ్ట్ కారులో తీసుకు వెళ్లి, బాటజంగాలపాలెం దగ్గర పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
