Site icon NTV Telugu

Shocking Incident : సాయం చేద్దామని వెళ్తే సర్వం దోచేశారు.. అమలాపురంలో దొంగల మాయాజాలం.!

Theft

Theft

మానవత్వం ముసుగులో వచ్చి మాయమాటలతో మోసగించే ముఠాలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాయం చేయడానికి వెళ్లిన ఒక వృద్ధుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఇద్దరు యువకులు ఆయన పెన్షన్ సొమ్మును తస్కరించిన ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన చవటపల్లి సత్యనారాయణ (80) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, తన నెలవారీ పెన్షన్ సొమ్ము రూ. 20,000లను బ్యాంకు నుండి విత్ డ్రా చేసుకున్నారు. ఆయన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయం నుండే ఇద్దరు గుర్తుతెలియని యువకులు ఆయనను అనుసరించారు. సత్యనారాయణ గమనించకుండానే వారు ఆయన ఇంటి వరకు ఫాలో అయ్యారు.

Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు

సత్యనారాయణ తన ఇంటి వద్దకు చేరుకోగానే, నిందితుల్లో ఒక యువకుడు బైక్ పై నుంచి కింద పడిపోతున్నట్లుగా నటిస్తూ డ్రామా ఆడాడు. అది చూసిన వృద్ధుడు, పాపం దెబ్బ తగిలిందేమోనన్న మానవత్వంతో ఆ యువకుడికి సాయం చేయడానికి దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో ఆ యువకులు చాకచక్యంగా వృద్ధుడి వద్ద ఉన్న రూ. 20 వేల నగదును దొంగిలించి, క్షణాల్లో అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుల కదలికలు గుర్తించబడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

Exit mobile version