రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రైతు కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో రూ. 10 లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది.
Read Also:School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు
పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్వార్‌లోని మలియార్ జాట్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతు కుటుంబం మొత్తం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ₹10 లక్షల నగదును కోల్పోయింది. బన్వారీ నాథ్ (40) అనే రైతు కుటుంబం గుడిసెలో నిద్రిస్తుండగా.. అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
Read Also:Woman Gives Birth: ట్రైన్ లోనే మహిళ ప్రసవం.. చప్పట్లతో మారుమోగిన కంపార్ట్మెంట్
పిల్లలు కేకలు వేయడంతో బన్వారీ నాథ్ వెంటనే మేల్కొని కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. కానీ ఈ ఘటనలో కానీ వారికి ప్రభుత్వం తరఫు నుంచి పరిహారంగా వచ్చిన రూ.10లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది.
Read Also:Delhi: విదేశీ కోచ్‌లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
సమాచారం అధికారులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇంట్లో సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. నష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదికను సిద్ధం చేయాలని సూచనలు ఇవ్వబడ్డాయి, తద్వారా బాధిత కుటుంబాలకు విపత్తు నిర్వహణ నిధి నుండి సహాయం అందించబడుతుంది. కాలిన నోట్లను నిబంధనల ప్రకారం మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని కూడా తిజారా SDM సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
