Shraddha Walker Case: అఫ్తాబ్.. దేశం మొత్తం ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇతను కంటికి కనిపిస్తే చంపేయాలన్నంత కసిగా చూస్తున్నారు ప్రజలు.. ప్రేమించిన ప్రియురాలిని అతి కిరాతకంగా చంపి 35 ముక్కలుగా నరికి శరీర భాగాలను అక్కడక్కడా విసిరేశాడు. అంత క్రూరంగా చేసినా అతడిలో ఇసుమంత పశ్చాత్తాపం కూడా కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ మధ్యన అదుపులోకి తీసుకున్న ఆప్తాబ్ ను జైలుకు తీసుకెళ్లే వేళలో అతడిపై దాడికి ప్రయత్నం జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడ్ని మరోసారి ఈరోజుకోర్టులో హాజరుపరిచారు.
ఇక జైల్లో అఫ్తాబ్ చేష్టలు చాలా వింతగా ఉన్నాయని తెలుస్తోంది. అసలు తానేమి చేయనట్టు.. తనకేమి తెలియదన్నట్లు తోటి ఖైదీలతో కలిసి చెస్ ఆడుతున్నాడట.. అంతేకాకుండా సిగ్గులేకుండా నవ్వుతూ వారితో ముచ్చట్లు పెడుతున్నాడట. ఇక ఇంగ్లిష్ పుస్తకాలు చదవడం, తినడం, నిద్రపోవడం.. ఇవే దినచర్యగా కొనసాగిస్తున్నాడని సమాచారం. శ్రద్దా తానూ ప్రేమించిన అమ్మాయి.. తనతో పాటు సహజీవనం చేసిన అమ్మాయి.. అతి క్రూరంగా చంపేశాను అన్న పశ్చాత్తాపం అతనిలో ఇసుమంత అయినా కనిపించకపోయేసరికి తోటి ఖైదీలు సైతం షాక్ అవుతున్నారట. మరి ఇంత క్రూరుడుకు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
