NTV Telugu Site icon

Crime News: దుర్మార్గుడా.. ఎంత పని చేశావ్ రా.. ప్రేమించలేదని నడిరోడ్డుపై

Crime

Crime

Crime News: మహిళలకు ఎక్కడ భద్రత లేకుండా పోతుంది. చట్టాలు, ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కొంతమంది మగాళ్ల చేతిలో అబలలు బలి అవుతూనే ఉన్నారు. వాక్ స్వాతంత్య్రం ఉన్న దేశంలో నచ్చలేదు అని చెప్పడం కూడా పెద్ద తప్పుగా మారిపోయింది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న ఒక పోకిరీకి నచ్చలేదు అని చెప్పడమే ఆమె చేసిన పెద్ద పొరపాటు అయ్యింది. ఆ ఒక్క మాట ఆమె ప్రాణాలు మీదకు తీసుకొచ్చింది. ప్రేమ అనే మైకంలో కొట్టుకొని తిరుగుతున్న ఆ ప్రేమోన్మాది.. ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని నడిరోడ్డుపైనే గొంతుకోసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. బోరబండలోని బంజారా నగర్ లో లక్ష్మి అనే యువతీ వెనుక సురేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో తిరుగుతున్నాడు. అయితే సురేష్ అంటే లక్ష్మీ కి అస్సలు ఇష్టం లేదు. అయినా ప్రేమించమని వెంటపడుతుంటే… ఆమె నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా వెంట పడకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో రగిలిపోయిన సురేష్.. నా ప్రేమనే అంగీకరించదా అంటూ ఉన్మాదిగా మారాడు. సోమవారం లక్ష్మీ స్కూటీపై వెళ్తుండగా.. ఎస్సార్ నగర్ సమీపంలో ఆమె బండి ఆపి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతుపై కత్తితో దాడి చేశాడు. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కలున్న వారు అతడిని అడ్డగించి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం లక్ష్మీ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Show comments