నేటి సమాజంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవపడి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇది.. భర్త తలను భార్య విచక్షణ రహితంగా నరికి చంపినా ఘటన ఏపీలోని రేణుగుంటలో చోటుచేసుకుంది. గురువారం రేణిగుంటలోని ఓ మహిళ తన భర్త తలను నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. పోలీస్ లైన్స్ రోడ్డులో రవిచంద్రన్ (53), వసుంధర అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు.
వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య వసుంధర భర్త తలను కత్తితో దాడి చేసి నరికి చంపింది. అంతేకాకుండా అనంతరం శరీరం నుంచి వేరు చేసిన తలను బ్యాగులో వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వసుంధరను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
