School Auto Accident: హబ్సిగూడలో స్కూల్ ఆటోకు ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లల ఆటో బస్సు వెనకాల నుంచి కిందకు దూసుకుని వెళ్లింది. ఆటో డ్రైవర్ తో పాటు ఒక విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు హుటా హుటిన ప్రమాదస్థలానికి చేరుకున్నారు. ఆటో పూర్తీగా బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో పోలీసులు, అక్కడున్న స్థానికులు ఎంత ప్రయత్నించిన ఆటోలోను బయటకు తెచ్చేందుకు వీలుకాలేదు. అయితే.. పోలీసులు వెంటనే క్రేన్ సిబ్బందికి సహాయం కోసం పిలిపించారు. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి పోలీసులు తొలగించారు.
Read also: Gwalior Shocker: వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని.. కూతురి గొంతుకోసి..
విద్యార్థినితో పాటు డ్రైవర్ ను నాచారం ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థిని చికిత్స పోతుందుతూ మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థిని విద్యార్ధిని తార్నాకలో కిమితీ కాలానికికి చెందిన సాత్వికగా గుర్తించారు. గౌతమ్ మోడల్ స్కూల్ లో సాత్విక పదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. తార్నాక నుంచి హబ్సిగూడ వెళ్తుండగా ఆటోకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ అత్యంత వేగంగా నడపడమే ప్రమాదాన్ని కారణమని పోలీసులు నిర్ధారించారు. సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఆటోను నడిపినట్లుగా స్థానికులు తెలిపారు. గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యానికి, స్వాత్విక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Heroine Poster: హీరోయిన్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ పోస్టర్ విడుదల
