A Security Guard Commits Suicide In Triangle Love Story: ఆల్రెడీ ఒక యువతితో సహజీవనం చేస్తున్న ఆ యువకుడు, మరో యువతిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఛాతిపై ఆమె ఫోటోను కూడా పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. కానీ.. ఇంతలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో.. అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే.. కర్నూలుకు చెందిన శివ ప్రసాద్(23) అనే ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. నగరానికి వచ్చిన కొత్తలో ఇతనికి కవిత అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. కొంతకాలానికే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు.
Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది
ఓవైపు కవితతో సహజీవనం చేస్తూనే.. తాను పని చేస్తున్న ఆసుపత్రిలోనే ఒక నర్సుతో ప్రేమలో పడ్డాడు. ఆమెని ఎంత గాఢంగా ప్రేమించాడంటే.. తన ఛాతిపై ఆమె ఫోటోను పచ్చబొట్టుగా కూడా వేయించుకున్నాడు. చివరికి శివప్రసాద్ ప్రేమ వ్యవహారం గురించి కవితకు తెలిసింది. దీంతో ఆమె అతడ్ని నిలదీసింది. తనతో సహజీవనం చేస్తూ.. మరో యువతితో ఎలా తిరుగుతున్నావని ప్రశ్నించింది. అందుకు ఏం సమాధానం చెప్పాలో తెలీక మిన్నకుండిపోయాడు. తనను మోసం చేశాడని భావించిన కవిత.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది జరుగుతుండగానే.. తాను ప్రేమించిన నర్సుని పెళ్లి చేసుకుందామని శివప్రసాద్ అడిగాడు. అయితే.. కవితతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసి, ఆ యువతి అతని ప్రపోజల్‌ని తిరస్కరించింది.
Ambati Rambabu: పూటకో మాట మాట్లాడే పవన్, చంద్రబాబు కలిసి.. వైసీపీని ఏం చేయలేరు
ఒకవైపు సహజీవనం చేసిన కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చేరడం, మరోవైపు తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో.. శివప్రసాద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ డిప్రెషన్‌లోనే అతడు శనివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. శివప్రసాద్ మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అటు.. ఆసుపత్రిలో కోలుకుంటున్న కవితని పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.