NTV Telugu Site icon

Drunken Man: మత్తులో విద్యార్థి వీరంగం.. మూడు వాహనాల్ని ఢీ.. ట్విస్ట్ ఏంటంటే?

Medical Student Hungama

Medical Student Hungama

A Medical Student Collided Three Vehicles With His Car In Hyderabad: మంగళవారం (03-01-23) రాత్రి ఓ విద్యార్థి మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించాడు. అతివేగంతో నిర్లక్ష్యంగా కారుని నడుపుతూ.. మూడు వాహనాల్ని ఢీ కొట్టాడు. అంతేకాదు.. వారితో దురుసుగా వ్యవహరించాడు. హైలైట్ ట్విస్ట్ ఏమిటంటే.. ఇతనికి డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే, రిజల్ట్ ఏమీ రాలేదు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలోని ఎయిర్‌పోర్టు రోడ్డులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Twitter: రాజకీయ ప్రకటనలపై నిషేధాన్ని సడలించనున్న ట్విట్టర్

బంజారాహిల్స్‌కి చెందిన గౌతమ్ మెహతి (25) అనే వైద్య విద్యార్థి నిన్న రాత్రి మత్తు పదార్థాల్ని సేవించాడు. అనంతరం అర్థరాత్రి తన కారేసుకొని బయలుదేరాడు. తొలుత 1:20 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు రెండో రోటరీ వద్ద మద్యం మత్తులో ముందుగా వెళ్తోన్న ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ తాజుద్దీన్ తలకు తీవ్ర గాయలయ్యాయి. అయినా అతనికి సహాయం చేయకుండా, రివర్స్‌లో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఎయిర్‌పోర్టు వైపు వెళుతున్న స్విఫ్ట్ కారుని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు వెనక భాగంతో పాటు ఎడమవైపు బాగం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి ఉడాయించిన గౌతమ్.. దారిలో మరో ద్విచక్రవాహనదారుడ్ని సైతం ఢీ కొట్టాడు.

ATM Technical Problem: ఏటీఎంలో సాంకేతిక లోపం.. కురిసిన నోట్ల వర్షం

ఇలా మద్యం మత్తులో మూడు వాహనాల్ని ఢీకొట్టడంతో.. గౌతమ్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, గౌతమ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే మాత్రం, అతడు మద్యం తాగినట్లు తేలలేదు. దీంతో అతడ్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచకుండా, వదిలేశారు. కానీ.. మరే ఇతర మత్తు పదార్థాలేమైనా సేవించాడా? అనే అనుమానంతో రక్తనమూనాల్ని తీసుకొని, పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, గౌతమ్‌పై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.