A Man Try To Molest Girl In The Name Of Lift In Hyderabad Tarnaka: చట్టాలను కఠినతరం చేస్తున్నా.. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరిగా మహిళ కనిపించిందంటే చాలు.. రాక్షసుల్లాగా వారిపై ఎగబడుతున్నారు. చివరికి నమ్మిన వారిని సైతం విడిచిపెట్టట్లేదు. అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఓ రాక్షసుడు కూడా లిఫ్ట్ పేరుతో ఒక అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ అమ్మాయి తప్పించుకోబోయి, ఓ లారీ కింద పడింది. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని తార్నాకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Viral Video: నీళ్ల డ్రమ్ముతో కూలర్ తయారీ.. ఆలోచనకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!
తార్నాక ప్రాంతంలో ఆర్తి అనే ఓ అమ్మాయి పాపకు పాలడబ్బా తెచ్చేందుకు బయటకు వెళ్లింది. అయితే మెడికల్ షాప్ మూసి ఉండటంతో.. ఆటో కోసం రోడ్డు మీద ఎదురుచూస్తోంది. ఇంతలో శ్రీధర్ అనే యువకుడు బైక్ మీద ఆమె వద్దకు వచ్చాడు. మెడికల్ షాప్ ముందే ఉందని చెప్పి, అక్కడిదాకా లిఫ్ట్ ఇస్తానని, ఆమెని బైక్ ఎక్కించుకున్నాడు. పాపం ఆర్తి.. అతడ్ని నమ్మి బైక్ ఎక్కింది. కొంత దూరం వెళ్లాక.. శ్రీధర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. తన రూంకి రావాలని పిలిచాడు. తార్నాక సల్మాన్ హోటల్ వద్ద బలాత్కారం చేయబోయాడు. అతడి చర్యతో ఖంగుతిన్న ఆర్తి.. తప్పించుకునే ప్రయత్నంలో కింద పడింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఆమె మీద నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆర్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.
Black Magic: బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసం.. నగదు రెండింతలు చేస్తానని..
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత.. ఆర్తి ఫోన్‌లో ర్యాపిడో బుక్ చేసి, ఆమెని ఇంటికి పంపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్తిని తీసుకొచ్చిన యువకుడ్ని నిలదీయడంతో.. తనని శ్రీధర్ పంపించాడని అతడు చెప్పాడన్నారు. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్తి కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శ్రీధర్‌ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ఆర్తి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.