NTV Telugu Site icon

Man Killed Over Land Issue: ప్రాణం తీసిన భూ వివాదం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా..

Man Killed Over Land Issue

Man Killed Over Land Issue

A Man Samarjith Singh Killed Bonagiri George In Ranga Reddy District Over Land Issue: భూవివాదం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ దుండగుడు ఆ వ్యక్తిపై రాడ్డుతో దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే అతను కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 12 గుంటల ల్యాండ్ విషయమై బోనగిరి జార్జ్ (62), సమర్జిత్ సింగ్ (52)ల మధ్య చాలాకాలం నుంచే గొడవలు జరుగుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ వీరి మధ్య భూవివాదం మరింత ముదురుతూ వచ్చింది. దీంతో.. జార్జ్ అడ్డు తొలగించుకోవాలని సమర్జిత్ పక్కా ప్లాన్ వేశాడు. అతడు ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌కి వెళ్తాడన్న విషయం తెలుసుకొని, ఆ సమయంలోనే మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

Pilot Rohith Reddy: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ప్లాన్ ప్రకారం.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి కమ్మగూడలో జార్జ్ మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా, సమర్జిత్ ఆయన్ను అడ్డగించాడు. ల్యాండ్ విషయంపై మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య తారాస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన సమర్జిత్.. తనతో పాటు తెచ్చుకున్న రాడ్డును జార్జ్ తలపై గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు జార్జ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తాను కొట్టిన దెబ్బకు జార్జ్ మరణించాడన్న విషయం తెలిసి.. సమర్జిత్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 గుంటల ల్యాండ్ విషయంలో జార్జ్, సమర్జిత్ మధ్య గొడవలు ఉన్నాయని.. ఈ హత్యకు ఆ భూవివాదమే కారణమని జార్జ్ కుటుంబీకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సమర్జిత్ కోసం గాలిస్తున్నారు.

Hawaii Flight Turbulence: విమానాన్ని కుదిపేసిన బలమైన గాలులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

Show comments