NTV Telugu Site icon

Extramarital Affair: భర్తని వదిలి ప్రియునితో కాపురం.. కట్ చేస్తే ఊహించని దారుణం

Tabseen Baby Case

Tabseen Baby Case

A Man Killed His Wife For Having Affair With Taxi Driver In Bangalore: కేవలం కొన్ని క్షణాల ఆనందం కోసం.. తమ కాపురాల్ని కూల్చేసుకుంటున్నారు కొందరు మహిళలు. భర్తల్ని సైతం విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాగే తనని వదిలి, ప్రియునితో కాపురం పెట్టినందుకు కోపాద్రిక్తుడైన ఓ భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన తబ్సీన్‌ బేబి (32) అనే మహిళకు 14 సంవత్సరాల క్రితం టైలరింగ్‌ పనిచేసే షేక్‌ సుహేల్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన కొత్తలో వీళ్లు కోల్‌కతాలోనే కాపురం పెట్టారు. అయితే.. చాలీచాలని జీతంతో అక్కడ బతకడం కష్టమవ్వడంతో, బతుకుతెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ కేజీ హళ్లిలో కాపురం పెట్టారు.

Chetan Kumar: హిందుత్వపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. జైలుపాలయ్యాడు

అక్కడ వారి సంసార జీవితం సాఫీగానే సాగింది. వచ్చిన జీతంతో, తమ పిల్లలతో సంతోషంగా జీవనం గడపసాగారు. అయితే.. ఆ తర్బాత తబ్సీన్ బేబీ దారి తప్పింది. ఒక ట్యాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. తన భార్యని మందలించాడు. అయినా మార్పు రాకపోవడంతో.. ఆరేళ్ల క్రితం ఇంటిని ఖాళీ చేసి, కుటుంబసమేతంగా తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయాడు. అక్కడికెళ్లిన తర్వాత కూడా తబ్సీన్ బేబీలో మార్పు రాలేదు. నిత్యం ఫోన్‌లో తన ప్రియునితో మాట్లాడుతూ ఉండేది. అలా ఆరు నెలలు గడిచిన తర్వాత.. ఒక రోజు తన భర్తను వదిలి, రహస్యంగా బెంగళూరుకు చేరుకుంది. ప్రియునితో కలిసి సారాయిపాళ్య అఫీజా లేఔట్‌లో కాపురం పెట్టింది. ఈ జంటకు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు.. భార్య తనని వదిలి వెళ్లినప్పటి నుంచి సుహేల్ ఆమెపై పగ పెంచుకున్నాడు.

Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం.. 2.7 తీవ్రతతో స్వల్పంగా కంపించిన భూమి

ఎన్నిసార్లు పిలిచినా తిరిగి కాపురానికి రాకపోవడం.. ప్రియునితో ఒక బిడ్డను కనడంతో.. తబ్సీన్ బేబీని చంపాలని సుహేల్ నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. సోమవారం రాత్రి కోల్‌కతా నుంచి బెంగళూరుకు వచ్చాడు. భార్య తబ్సీన్‌ బేబీ ఇంటి వద్దకు వెళ్లి.. తనతో పాటు తిరిగి రావాలని కోరాడు. అయితే.. అందుకు ఆమె అంగీకరించలేదు. ప్రియుడి వద్దే ఉంటానంటూ మొండికేసింది. దీంతో కోపోద్రిక్తుడైన సుహేల్‌, ఆమె గొంతుపై కత్తితో పొడిచి హత్యచేశాడు. ఆపై.. ఆ బాలుడ్ని తొడపై పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే నిందితుడు సుహేల్‌ని పట్టుకొని, విచారణ చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.