NTV Telugu Site icon

Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..

Old City Crime

Old City Crime

Hyderabad Crime: పాతబస్తీ బాలాపూర్‌లో గ్యాంగ్‌స్టర్ రియాజ్ పై కాల్పులు కలకలం రేపాయి. బాలాపూర్‌లోని ఏఆర్‌సీఐ రోడ్డులో రియాజ్‌పై గుర్తు తెలియని దుండగుల మూడు రౌండ్ల కాల్పులు చేసి హత్య చేశారు. దీంతో రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుడు రియాజ్ ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు రియాజ్ పై కాల్పులు చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య ముందు.. హత్య జరిగిన తరువాత ఏ వాహనాలు ఈ రూట్ వైపు వెళ్లాయని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలపూర్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: CM Revanth Reddy: నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

గతంలో పలు హత్య కేసుల్లో పలు నేరాల్లో గ్యాంగ్ స్టర్ రియాజ్ ప్రమేయం వుందని పోలీసులు వెల్లడించారు. రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు వున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫజల్ అనే రౌడీ షీటర్ మర్డర్ కేసులో మృతుడు రియాజ్ A5 గా నిందితుడుగా తెలిపారు. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య వల్లే నజీర్ గ్యాంగ్ రియాజ్‌ ను టార్గెట్‌ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇది పాత కక్షలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రియాజ్‌ ను చంపింది నజీర్‌ గ్యాంగ్‌ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఆధారాలు ఇంకా తెలియాలని అన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే కారంతో కలిపిన నీళ్లు రియాజ్ కళ్ళలో చల్లి రియాజ్ పై పిస్టల్ తో రౌడి షీటర్ చాకు నజీర్ గ్యాంగ్ కాల్పులు జరిపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీ కోసం ఈ కేసుపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటి & హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రౌడి షీటర్ చాకు నజీర్ గ్యాంగ్ అదుపులో తీసుకుని దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన రద్దు.. ఫేక్ ప్రచారం నమ్మొద్దు..

Show comments