NTV Telugu Site icon

Teacher Robbery: తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు.. ఆపై చోరీ..

Teacher Arrested In Robbery

Teacher Arrested In Robbery

A Government Teacher Arrested In Robbery Case In Sangareddy: అతడు ఒక ఉపాధ్యాయుడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో, తానూ బుద్ధిగా ఉండాల్సిందిగా పోయి.. చెడు వ్యసనాలకు బానిసై, వక్రమార్గం పట్టాడు. తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు పంపాడు. అంతటితో ఆగకుండా.. చోరీకి సైతం పాల్పడ్డాడు. చివరికి అడ్డంగా దొరికిపోయి, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ దుండగుడి పేరు సార సంతోష్. జోగిపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తొలుత అందరితోనూ సఖ్యతగానే వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తోటి ఉద్యోగినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో మంచిగా ఉన్నట్టు వ్యవహరించి, ఆ తర్వాత నిజస్వరూపం చూపించాడు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. మొదట్లో అలాంటివి పంపించొద్దని వార్నింగ్ ఇచ్చింది. అప్పటికీ మారకపోవడంతో.. పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. అతడ్ని సస్పెండ్ చేశారు. తనకు బుద్ధి వచ్చిందని చెప్పడంతో.. ఇటీవలే తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

Love Tragedy: తన ప్రేమని అంగీకరించలేదని.. నడిరోడ్డుపైనే..

పోనీ.. అప్పటినుంచైనా సంతోష్ పూర్తిగా మారాడా? అంటే అదీ లేదు. చోరీకి పాల్పడి జైలుకెళ్లాడు. ఈనెల 10వ తేదీన విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన రాములు ఓ బ్యాంకులో రూ. 1.50 లక్షలు డ్రా చేశాడు. భార్యతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఇది గమనించిన సంతోష్.. వారిని ఫాలో అవుతూ వచ్చాడు. మార్గమధ్యంలో కూరగాయల కోసం రాములు, అతని భార్య ఆగారు. ఇదే సరైన సమయం అని భావించి.. సంతోష్ రాములు వద్దనున్న డబ్బులు తీసుకొని, అక్కడి నుంచి ఉడాయించాడు. అతడ్ని వెంబడించినా, కనుచూపు మేర కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంతోష్ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈనెల 17వ తేదీన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకొని, రాములకు తిరిగి ఇచ్చారు. సంతోష్‌ను రిమాండ్‌కు పంపారు. అతడో ఉపాధ్యాయుడు అనే విషయం తెలిసి.. పోలీసులు విస్తుపోయారు.

Jacqueline Fernandez: అతడు నా కెరీర్‌ని నాశనం చేశాడు.. జాక్వెలిన్ ఆవేదన