A Girl Commits Suicide After Her Boyfriend Cheated Her: అవును.. ఈ కాలంలో ఉన్న యువత కేవలం ‘లస్ట్’ కోసం ప్రేమని అడ్డం పెట్టుకున్న విషయం వాస్తవమే. శారీరక సుఖం పొందడం కోసం మాత్రమే.. ఆ రెండు పదాలని వాడుకుంటారు. కోరిక తీరాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతుంటారు. కానీ.. కొందరు మాత్రం నిజంగానే ప్రేమిస్తారు. ఫలానా అబ్బాయి/అమ్మాయితోనే తమ జీవితమని నిర్ణయించుకొని, గాఢ ప్రేమలో మునిగితేలుతారు. తమ పార్ట్నర్‌లలో ఎవరో ఒకరు మోసం చేశారని తెలిస్తే మాత్రం.. వీళ్లు తట్టుకోలేరు. వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందంటే.. ప్రాణం తీయడమో లేదా ప్రాణం తీసుకోవడమో దాకా వెళ్తుంది. ఇప్పుడు తాజాగా ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి ముఖం చాటేశాన్న బాధ తట్టుకోలేక.. ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Strange Incident: తల్లి చనిపోయిందనుకొని కర్మకాండ.. రెండేళ్ల తర్వాత యూట్యూబ్‌లో ప్రత్యక్ష్యం
గద్వాల జిల్లాకు చెందిన వీరప్ప అనే ఓ యువకుడు ప్రేమ పేరుతో సునంద (23) అనే యువతి వెనకాల పడ్డాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నువ్వు లేకుండా నేను ఉండలేనని, నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో.. ఆ యువతి ఇతడ్ని ప్రేమించింది. ఇలా కొంతకాలం వరకూ ఈ ప్రేమ వ్యవహారం సజావుగానే సాగింది. కానీ.. పెళ్లి టాపిక్ వచ్చేసరికి వీరప్ప ముఖం చాటేశాడు. చస్తే నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో అవమానంగా భావించిన సునంద ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లారు. వీరప్ప మోసం చేయడం వల్లే చనిపోయింది కాబట్టి.. అతని చేత రూ.9 లక్షల పరిహారం కట్టించారు. తొలుత అతడు ఒప్పుకోలేదు కాదు.. గ్రామ పెద్దలు బలవంతం చేయడంతో, అతడు ఆ పరిహారం ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Chada Venkat Reddy: మణిపూర్ దుర్మార్గానికి మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి