NTV Telugu Site icon

Crime News: ఛీఛీ.. కామాంధుడు.. కన్నకూతురినే గర్భవతిని చేసి..

Crime

Crime

Crime News: అసలు ఈ సమాజం ఎటు పోతోంది. కొన్నిచోట్ల జరిగేవి చూస్తుంటే.. ఛీఛీ వీరసాలు మనుషులేనా అనిపిస్తుంది. కామంతో కళ్ళుమూసుకుపోయి.. కన్నకూతురుపై అత్యాచారాలు చేస్తున్న తండ్రులు.. వావివరుసలు మరిచి పరాయివారి భార్యను కోరుకుంటూ వివాహేతర సంబంధాలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. తాజాగా ఒక నీచుడు.. తాగిన మైకంలో కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఆమెను తల్లిని చేసిన భయంకరమైన ఘటన అందరప్రదేశ్, విశాఖపట్నంలో వెలుగు చూసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గాజువాక మండలం గంగవరానికి చెందిన ఒక బాలిక 10 వ తరగతి చదువుతుంది. కుటుంబంతో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్న ఆమె తండ్రి ఒక తాగుబోతు. తల్లి కూలీ పనులకు వెళ్తుంది. ఎలాంటి పనిపాట లేకుండా జులాయిగా తిరిగే తండ్రి.. నిత్యం తాగొచ్చి తన భార్యను కొడుతుండేవాడు. ఇక గత కొంతకాలంగా ఆ తాగుబోతు కన్ను కూతురిపై పడింది. తాగిన మైకంలో కామం తలకెక్కి కూతురు అనే ఇంగితం అని కూడా లేకుండా 15 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. గత కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో బాలిక నోరు విప్పలేదు. అయితే గత కొన్ని రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అయ్యారు. హాస్పిటల్ సిబ్బందినే దీనికి కారణం ఎవరు అని బాలికను గట్టిగా అడుగగా.. తన తండ్రి చేసిన అఘాయిత్యాన్ని ఏకరువు పెట్టింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న వారు విచారణ చేపట్టారు.

Show comments