నటి కరాటే కళ్యాణి పై కేసు నమోదైంది. జగద్గిరిగుట్ట పీఎస్ లో కరాటే కళ్యాణి పై కేసు నమోదు అయింది. గతంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ బాలిక పై జరిగిన హత్యాచార వివరాలను కరాటే కళ్యాణి.. తన సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది. అయితే.. ఈ సంఘటన పై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్ట కు చెందిన నితేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
దీంతో కరాటే కళ్యాణి పై… కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సింగరేణి కాలనీలో బాలిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే.. ఈ కేసులో నిందితుడు రైలు కింద పడి మరణించాడు.
