Road Accident: ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం సమీపంలో మరో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. శ్రీశైలం సమీపంలోని శిఖరం నుండి ఇష్టకామేశ్వరి గేటుకు వెళ్లే మార్గం మధ్య దారిలో నల్లమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి భక్తులకు చెందిన ఓ ఎలక్ట్రికల్ వాహనం చెట్లకు ఢీ కొట్టింది.. అదుపు చేయలేక చెట్లను, కొండ రాళ్లను ఢీకొని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి కారులోని భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారు.. అయితే, భక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి.. చిన్నచిన్న గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా సున్నిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే, కారులో ప్రయాణిస్తున్న భక్తులు జంగారెడ్డిగూడెం నుండి శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వాహనం చెట్లను, కొండరాళ్లను ఢీ కొట్టి ఆగడంతో.. ప్రాణాపాయం నుండి బయటపడ్డామని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!