NTV Telugu Site icon

Madhya Pradesh Love Crime: సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..

Man Killed Sister Lover

Man Killed Sister Lover

A Boy Killed His Friend For Having Affair With Sister In Madhya Pradesh Kannauj: మధ్యప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలుసుకున్న ఆమె అన్న.. స్నేహితుడ్ని పార్టీ పేరుతో పిలిచి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసుని పోలీసులు 24 గంటల్లోనే ఛేధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. జులై 17వ తేదీన కన్నౌజ్ పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గుర్తు తెలియనిమృతదేహం వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని, విచారణ చేపట్టారు. అప్పుడు వాళ్లకు.. ఆ మృతదేహం తూబేల్ పురాకు చెందిన అనిల్‌దిగా (25) గుర్తించారు. అతని తండ్రి విక్రమ్ మరో పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు మిస్ అయినట్లు ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఇక అప్పటి నుంచి పోలీసులు అనిల్ హత్య మిస్టరీని ఛేధించడం మొదలుపెట్టారు.

Extramarital Affair: పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

ఈ విచారణలో భాగంగా.. పోలీసులకు మొదట అనిల్ స్నేహితుడు దీపక్ కల్వార్‌పై అనుమానం వచ్చింది. అతనికి సంబంధించిన వ్యక్తుల్ని కూడా విచారించారు. ఫైనల్‌గా.. ఈ హత్య వెనుక ప్రధాన హస్తం దీపక్‌దే ఉండొచ్చని అనుమానం కలగడంతో.. అతనితో పాటు అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు దీపక్ తానే తన స్నేహితులతో కలిసి అనిల్‌ని చంపినట్టు ఒప్పుకున్నాడు. అనిల్ కూడా తనకు స్నేహితుడేనని తెలిపాడు. అయితే.. తన సోదరితో అనిల్ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న విషయం తెలిసి తాను కోపాద్రిక్తుడినయ్యానని, దాంతో అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని దీపక్ పేర్కొన్నాడు. పార్టీ పేరుతో అనిల్‌ని పిలిపించి.. అతడ్ని చంపినట్లు తెలిపాడు. కాగా.. తలపై బలమైన రాడ్డుతో బాదడం వల్ల అనిల్ మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.

Gadwal Love Tragedy: ప్రేమించి మోసం చేసిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందంటే?