Boy Harassed Girl For Bet: స్నేహితులతో పందెం.. మైనర్‌పై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Boy Harassed Minor Girl In Jharkhand After Fighting With Friends: ఝార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. తననే ప్రేమిస్తోందని స్నేహితులతో పందెం కాసిన ఓ యువకుడు.. మైనర్‌పై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ మొత్తం ఉదంతాన్ని వీడియో తీశాడు. చివరికి ఆ వీడియో మైనర్ తల్లిదండ్రులకు చేరడంతో కలకలం రేగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ధన్‌బాద్‌కు చెందిన యువకుల మధ్య ఓ మైనర్ అమ్మాయి విషయమై గొడవ జరిగింది. తననంటే తననే ప్రేమిస్తోందంటూ వాదనకు దిగారు. అప్పుడు సంజయ్ అనే వ్యక్తి.. ఆ అమ్మాయి తననే ప్రేమిస్తోందని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని పందెం వేశాడు.
మరుసటి రోజే సంజయ్ మాయమాటలు చెప్పి, ఆ మైనర్ బాలికను పొదల్లోకి తీసుకెళ్లాడు. మొదట్లో ఆ అమ్మాయి పట్ల మంచిగా వ్యవహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి నిరాకరించినా, బలవంతం చేశాడు. ఈ ఘాతుకాన్ని ఫోన్లో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోని తన స్నేహితులకు పంపించి, ‘ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోంది అనడానికి ఇదే సాక్ష్యం’ అనే మెసేజ్ పెట్టాడు. అయితే.. సంజయ్ స్నేహితులు ఆ వీడియోని బాలిక బంధవులకు చూపించారు. దీంతో కోపాద్రిక్తురాలైన ఆ మైనర్ బంధువులు.. అతనికి తగిన బుద్ధి చెప్పి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంజయ్‌ని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!