Site icon NTV Telugu

Boy Harassed Girl For Bet: స్నేహితులతో పందెం.. మైనర్‌పై అత్యాచారం

Jharkand Minor Case

Jharkand Minor Case

A Boy Harassed Minor Girl In Jharkhand After Fighting With Friends: ఝార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. తననే ప్రేమిస్తోందని స్నేహితులతో పందెం కాసిన ఓ యువకుడు.. మైనర్‌పై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ మొత్తం ఉదంతాన్ని వీడియో తీశాడు. చివరికి ఆ వీడియో మైనర్ తల్లిదండ్రులకు చేరడంతో కలకలం రేగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ధన్‌బాద్‌కు చెందిన యువకుల మధ్య ఓ మైనర్ అమ్మాయి విషయమై గొడవ జరిగింది. తననంటే తననే ప్రేమిస్తోందంటూ వాదనకు దిగారు. అప్పుడు సంజయ్ అనే వ్యక్తి.. ఆ అమ్మాయి తననే ప్రేమిస్తోందని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని పందెం వేశాడు.

మరుసటి రోజే సంజయ్ మాయమాటలు చెప్పి, ఆ మైనర్ బాలికను పొదల్లోకి తీసుకెళ్లాడు. మొదట్లో ఆ అమ్మాయి పట్ల మంచిగా వ్యవహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి నిరాకరించినా, బలవంతం చేశాడు. ఈ ఘాతుకాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోని తన స్నేహితులకు పంపించి, ‘ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోంది అనడానికి ఇదే సాక్ష్యం’ అనే మెసేజ్ పెట్టాడు. అయితే.. సంజయ్ స్నేహితులు ఆ వీడియోని బాలిక బంధవులకు చూపించారు. దీంతో కోపాద్రిక్తురాలైన ఆ మైనర్ బంధువులు.. అతనికి తగిన బుద్ధి చెప్పి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంజయ్‌ని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.

Exit mobile version