Site icon NTV Telugu

Marriage Twist: ఎనిమిదేళ్ల కాపురం తర్వాత.. బిగ్ ట్విస్ట్.. ఆయన కాదు.. ఆమె..!

Gujarat

Gujarat

Marriage Twist: ఎనిమిదేళ్లుగా ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలిచింది. ఇదిలా ఉండగా.. వారి జీవితంలో ఓ చేదు నిజం బయటకి రావడంతో అలజడి రేగింది. తన వద్ద భర్త దాచిన షాకింగ్ నిజం తెలియడంతో ఆ భార్య గుండె బద్దలైంది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయమేమిటంటే ఆమె భర్త అసలు పురుషుడే కాదన్న నిజం ఆమెను వణికిపోయేలా చేసింది. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ తన మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. మరో వివాహం చేసుకుంది. ఒక కూతురు ఉన్న ఆమె 2014లో ఢిల్లీలో పని చేసే విరాజ్‌ వర్దన్‌ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో రెండో పెళ్లి చేసుకుంది.

2014 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కశ్మీర్‌కు కూడా వెళ్లారు.అయితే ఆమెను శారీరకంగా కలవకుండా చాలా కాలం పాటు దూరం పెడుతూనే వచ్చాడు. ఆమె విరాజ్‌ను ఒత్తిడి చేయడంతో.. గతంలో తనకు రష్యాలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని.. తాను సంసార సుఖానికి పనికి రానని చెప్పాడు. ఓ మైనర్‌ సర్జరీ జరిగితే అంతా సెట్‌ అవుతుందని చెప్పాడు. దీంతో నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడని ఆమె అతన్ని క్షమించేసింది. ఆపై ఆ జంట అన్యోన్యంగానే ఉంటూ వచ్చింది.

Pakistan PM: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. రష్యా అధ్యక్షుడి నవ్వులు!

జనవరి 2020లో, అతను తన బరువును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పాడు.దాని కోసమని కోల్‌కతా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన విరాజ్‌ వర్దన్ తన భార్యతో శారీరకంగా కలవడం ప్రారంభించాడు. విరాజ్ కోల్‌కతాకు వెళ్లింది బరువు తగ్గే సర్జరీ కోసం కాదని.. పురుషుల అవయవాల మార్పిడి కోసం డాక్టర్‌ రిపోర్టుల ద్వారా తెలుసుకున్న ఆమెకు గుండె పగిలినంత పని అయ్యింది. అనంతరం భర్త చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

విజైతా అనే యువతి.. విరాజ్‌ వర్దన్‌గా పేరు మార్చుకుని.. మ్యాట్రిమోనియల్ సర్జరీ ద్వార తనను సంప్రదించిందని తెలియడంతో ఆమె తల తిరిగిపోయింది. విజైతా కుటుంబం తనను మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించింది. అతను తనతో అసహజంగా పాల్గొనడం ప్రారంభించాడని, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఢిల్లీ నివాసి అయిన నిందితుడిని వడోదరకు తీసుకువచ్చినట్లు గోత్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంకే గుర్జర్ తెలిపారు.

Exit mobile version